News February 8, 2025

సిరిసిల్ల: సమస్యలుంటే సంప్రదించాలి

image

రానున్న ఎండాకాలం, వానకాలం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండటం కోసం తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిరిసిల్ల సిస్ పరిపాలన సంచాలకులు విజయేందర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్ నిర్వహణలో భాగంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఆ యొక్క మండల ఏఈలకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు.

Similar News

News March 24, 2025

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

image

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన ఘటన దమ్మపేట మండలంలో జరిగింది. మండలంలోని ముష్టిబండ శివారులో తెల్లవారుజామున లారీ, డీసీఎం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నాగాలాండ్‌కి చెందిన ఆశిష్ పాలె మృతి చెందాడు. అశ్వారావుపేట మం. నారంవారిగూడెం బంధువుల ఇంటికి వెళ్తుండగా గాంధీనగర్ వద్ద గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సరస్వతి, కృష్ణ అనే తల్లికొడుకులు మృతి చెందారు.

News March 24, 2025

MNCL: మహాప్రస్థానంపై పొలిటికల్ వార్

image

మంచిర్యాల నియోజకవర్గంలో రాజకీయాలు మహాప్రస్థానం(గోదావరి తీరంలో వైకుంఠధామం) చుట్టే తిరుగుతున్నాయి. BRSహయాంలో అప్పటి ఎమ్మెల్యే దివాకర్‌రావు దీని నిర్మాణానికి వ్యాపారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారని ప్రస్తుత MLA ప్రేమ్‌సాగర్ రావు ఆరోపిస్తున్నారు. తాను గెలిచాక ఎలాంటి అవినీతి లేకుండా పూర్తిచేయించానని చెబుతున్నారు. దీనికి రూ.11కోట్ల వరకు ఖర్చుచేస్తే అవినీతి జరగలేదా అని దివాకర్‌రావు విమర్శిస్తున్నారు.

News March 24, 2025

ప్రకాశం: EKYC ఎక్కడ చేస్తారంటే..?

image

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.61లక్షల రేషన్ కార్డుల ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 19.37లక్షలుగా ఉంది. ఇందులో 17.31లక్షల మందే EKYC చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్ల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.

error: Content is protected !!