News April 2, 2025

సిరిసిల్ల: సర్దార్ పాపన్న పోరాటం మరువలేనిది: కలెక్టర్

image

బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సర్ధార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

Similar News

News September 15, 2025

సీఎంకు అనకాపల్లి కలెక్టర్ విజ్ఞప్తి

image

అనకాపల్లి జిల్లాలో పశుసంపద, పువ్వులు, కూరగాయల సాగుకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పాల్గొని జిల్లా అభివృద్ధి నివేదికను అందజేశారు. ప్రతి ఇంటికి ఒకటికంటే ఎక్కువ పశువులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ జాతి పశువులను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు రాయితీ అందించాలన్నారు.

News September 15, 2025

వనపర్తి: మహిళలు, పిల్లల ఆరోగ్యానికి ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్’: కలెక్టర్

image

మహిళలు, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్థ నారీ, సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో మహిళలు, పిల్లల సాధికారత సాధించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

News September 15, 2025

విశాఖలో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు

image

గత నెల ఒకటి రెండు తేదీల్లో ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో 81 హోటల్స్‌లో శాంపిల్స్ సేకరించి ఫుడ్ ల్యాబరేటరీకి పంపించారు. వీటి ఫలితాలు రావడంతో 15 హోటల్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని మరో 14 హోటల్స్‌పై జేసి కోర్టులో జరిమానా విధిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి ఓ ప్రకటనలో తెలిపారు. హోటల్స్ యజమానులు ఫుడ్ సేఫ్టీ ప్రకారం నాణ్యత పాటించాలన్నారు.