News February 5, 2025

సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?

image

అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.

Similar News

News December 3, 2025

ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.

News December 3, 2025

యువతకు నైపుణ్యంపై పార్లమెంట్‌లో ఎంపీ హరీష్ గళం

image

కోనసీమ జిల్లా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెంచాలని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి లోకసభలో 377 ద్వారా కోరారు. జిల్లా యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి సౌకర్యాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో తగిన శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి యువతకు మద్దతు ఇవ్వాలని కోరారు.

News December 3, 2025

చిట్యాల: ఇంటి పన్ను వసూళ్లు రికార్డు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. మొత్తం రూ. 13,97,355 వసూలు అయినట్లు ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. అత్యధికంగా వెలిమినేడులో రూ. 2,70,575 వసూలు కాగా, బొంగోనిచెరువు, గుండ్రాంపల్లిలలో కూడా భారీగా పన్నులు వసూలయ్యాయి. ఎన్నికల కారణంగానే ఈ స్థాయిలో వసూళ్లు పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.