News February 5, 2025
సిరిసిల్ల: సీఎం నోట ‘KTR ఆత్మహత్య’.. మీ కామెంట్?

అసెంబ్లీలో కాంగ్రెస్, BRS మధ్య రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని కొందరు మాట్లాడుతున్నారని, అలాంటివేమీ రావని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KTR ఏమైనా ఆత్మహత్య చేసుకుంటారా.. సిరిసిల్లకు ఉపఎన్నిక రావడానికి?’ అని అన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని KTR చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాము ఎన్నికల కోసం కులగణన చేయలేదని, ప్రజల అభివృద్ధి కోసమే చేశామని స్పష్టం చేశారు.
Similar News
News March 17, 2026
గద్వాల్: రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల తనిఖీ

గద్వాల జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈవీఎంల నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తెరిచి తనిఖీ నిర్వహించారు. యంత్రాల భద్రత విషయంలో ఎటువంటి అప్రమత్తత లోపించకుండా, నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.
News March 17, 2026
ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.
News March 17, 2026
ఒత్తిడి పెరిగితే.. అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.


