News February 22, 2025
సిరిసిల్ల: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే https://www.cybercrime.gov.in సైట్ లో రిపోర్ట్ చేయాలన్నారు. లేదా 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ వెబ్సైట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News November 15, 2025
చంద్రగిరి: బీటెక్ విద్యార్థి మృతి

చంద్రగిరి మండలం కోదండరామాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యానికి చెందిన లక్ష్మీకాంత్ చిత్తూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్‌పై తిరుపతికి వచ్చే క్రమంలో లారీని ఢీకొన్నాడు. విద్యార్థి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
ఏలూరు: 72 ప్రైవేటు బస్సులపై కేసులు..రూ.7.65 లక్షల జరిమానా

ఏలూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి రవాణా శాఖ తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో మొత్తం 72 ప్రైవేటు బస్సులపై కేసుల నమోదు చేశామని డీటీసీ(జిల్లా రవాణాధికారి కమిషనర్) షేక్ కరీం తెలిపారు. ఏలూరు హైవేలోని కలపర్రు వద్ద తనిఖీలు జరగగా..రూ. 7.65 లక్షల జరిమానా విధించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపితే సీజ్ చేస్తామని డీటీసీ హెచ్చరించారు.
News November 15, 2025
ప్రజాస్వామ్య విలువలు పతనం: జగన్

AP: హిందూపురంలోని YCP కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అభిమానులు <<18297222>>దాడి<<>> చేశారని జగన్ ట్వీట్ చేశారు. ‘ఈ అనాగరిక చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ పార్టీల కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టడం, కార్యకర్తలపై దాడి చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తాయి’ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుందని అన్నారు.


