News March 10, 2025

సిరిసిల్ల: 16 నుండి 20 వరకు శివ కళ్యాణ మహోత్సవం

image

ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు వేములవాడ పట్టణంలోని శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ కార్య నిర్వహణ అధికారి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరై దేవుని కృపకు పాత్రులు కాగలరని వారు స్పష్టం చేశారు.

Similar News

News December 5, 2025

గోదావరి డెల్టాలో నీటి కొరత.. రబీ సాగు కష్టమే

image

గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది రబీలో సాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవని గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ కే. గోపీనాథ్ తెలిపారు. సాగు, తాగు, పరిశ్రమలకు కలిపి మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 73.36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. నదిలో సహజ జలాలు (9.45 టీఎంసీ), పోలవరం(20 టీఎంసీ), సీలేరు నుంచి (43.91 టీఎంసీ) అందుబాటులో ఉన్నా.. 19.90 టీఎంసీల నీటి కొరత ఏర్పడిందన్నారు.

News December 5, 2025

యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

image

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్‌లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

News December 5, 2025

దీపం కొండెక్కితే..?

image

దీపం కొండెక్కిన తర్వాత ఉప్పును పారే జలంలో నిమజ్జనం చేయాలి. వత్తులను దాచిపెట్టుకోవాలి. ప్రమిదలను శుభ్రం చేసుకొని మళ్లీ వాడొచ్చు. నిమజ్జనం సాధ్యం కాకపోతే నీళ్లలో వేయాలి. శుక్రవారం దీపారాధన చేస్తే శనివారం ఈ పరిహారాలు పాటించాలి. ఆవుకు ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఈ ఉప్పు దీపాన్ని ఇంటికి ఈశాన్య దిశలో పెట్టాలి. ఇలా 11, 21 వారాలు చేస్తే శుభం కలుగుతుంది. దాచిపెట్టుకున్న వత్తులను ధూపంలో వాడుకోవచ్చు.