News March 13, 2025

సిరిసిల్ల: 19 లోపు సమావేశాలు పూర్తి చేయాలి: ఎన్నికల అధికారి

image

ఈనెల 19వ తేదీలోపు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటరు నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు పూర్తిస్థాయిలో అమలుచేయాలన్నారు. 

Similar News

News March 26, 2025

నిజామాబాద్ POLITICS.. కాంగ్రెస్ ప్రక్షాళన

image

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. 18 ఏళ్ల తర్వాత జిల్లా కాంగ్రెస్ కమిటీలతో రేపు ఢిల్లీలో మీటింగ్ పెట్టనున్నారు. ఇందులో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ఉంటుందని టాక్. నిజామాబాద్ డీసీసీ చీఫ్‌గా మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్లారు. ఆయనకు ఇటీవల రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్‌ను అప్పగించారు.

News March 26, 2025

శ్రేయస్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ ప్రశంసలు

image

PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆటతీరుపై మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. గత ఏడాది కాలంలో అయ్యర్ తన ఆటను అద్భుతంగా మెరుగుపర్చుకున్నాడన్నారు. ప్రస్తుతం అతను అన్ని ఫార్మాట్లకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కొన్ని ఇష్యూస్ తర్వాత ఆటను ఇంప్రూవ్ చేసుకున్న తీరు గొప్పగా ఉందని పేర్కొన్నారు. నిన్న గుజరాత్‌తో మ్యాచ్‌లో అయ్యర్ 97* పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

News March 26, 2025

భీమవరం: ‘నేడు పదో తరగతి పరీక్షకు 517 డుమ్మా’

image

నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.

error: Content is protected !!