News May 20, 2024
సిరిసిల్ల: 2 నెలల్లో 17 లక్షల పైచిలుకు బీర్లు తాగేశారు!

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సిరిసిల్ల జిల్లాలో రూ.85.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి 16న కోడ్ ప్రారంభం కాగా.. మే 17 వరకు (2నెలల్లో) 1,45,228 కేస్ల బీర్లు, 76,943 కేస్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేస్లో 12 సీసాలుంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మద్యం కంటే చల్లని బీర్లకే మందుబాబులు మొగ్గు చూపారు. కోడ్ ఉన్నప్పటికీ JAN, FEB మాదిరిగానే విక్రయాలు సాగాయి.
Similar News
News October 14, 2025
KNR: కష్టపడిన వారికే పార్టీలో సముచిత స్థానం

పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా సముచిత స్థానం దక్కుతుందని ఏఐసీసీ పరిశీలకుడు, హంగల్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మానే స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీసీ, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఏఐసీసీ ఆదేశాల ప్రకారం, వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.
News October 14, 2025
KNR: మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కార్యక్రమం

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు చర్చించారు.
News October 14, 2025
డీసీసీ ఎన్నికల పరిశీలకుడిని కలిసిన KNR కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అబ్జర్వర్గా వచ్చిన కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే మనే శ్రీనివాస్ను సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.