News February 22, 2025

సిరిసిల్ల: 2464 మంది పిల్లలను గుర్తించాం: DMHO

image

సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలలో కంటి సమస్యలు ఉన్న 2464 మంది విద్యార్థులను గుర్తించామని సిరిసిల్ల DMHO రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ విద్యార్థులను మరల కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్ష చేయించి అవసరమైన వారికి కళ్లద్దాలు, కంటి శాస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 20 వరకు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News October 14, 2025

వంటింటి చిట్కాలు

image

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 14, 2025

SDPT: ఈ నెల 16,17న జిల్లా స్థాయి సెలక్షన్

image

సిద్దిపేట జిల్లా ఆత్య పత్య అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆత్య, పత్య జూనియర్ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి బుస్స మహేష్ తెలిపారు. ఈ నెల 16,17తేదీలలో చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సెలక్షన్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు పోటిల్లో పాల్గొనాలని సూచించారు.

News October 14, 2025

దేశంలోనే తొలి డ్రోన్‌ హబ్‌ ఓర్వకల్లులోనే..

image

దేశంలోనే తొలి <<18000986>>డ్రోన్ <<>>హన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఏర్పాటు కానుంది. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డ్రోన్ల వినియోగానికి విస్తృత అవకాశాలున్న మ్యాపింగ్, సర్వే, వ్యవసాయం, ఫొటోగ్రఫీ, తనిఖీలు, నిఘా రంగాలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. డ్రోన్ల రంగంలో మన దేశ వాటా కేవలం 3 శాతం కాగా దీన్ని 20 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తోంది.