News February 22, 2025

సిరిసిల్ల: 2464 మంది పిల్లలను గుర్తించాం: DMHO

image

సిరిసిల్ల జిల్లాలోని పాఠశాలలో కంటి సమస్యలు ఉన్న 2464 మంది విద్యార్థులను గుర్తించామని సిరిసిల్ల DMHO రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఈ విద్యార్థులను మరల కంటి వైద్య నిపుణుల ద్వారా పరీక్ష చేయించి అవసరమైన వారికి కళ్లద్దాలు, కంటి శాస్త్ర చికిత్సలు చేయించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మార్చి 20 వరకు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News March 21, 2025

పులివెందుల: మేమేం పాపం చేశాం.!

image

పులివెందుల పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఓ మహిళ చంటి బిడ్డను ఎత్తుకొని బిక్షాటన చేస్తున్న ఘటన కనిపించింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డతో ఏ మహిళ ఇలాంటి పని చేయదు. ఆ పసిబిడ్డ నిజంగా కన్నబిడ్డనా లేక ఆ పసిబిడ్డను కూడా డబ్బు దందాకు వాడుకుంటున్నారా అని పలువురు సందేహిస్తున్నారు. వీధి బాలలను సంరక్షించాల్సిన అధికారులకు ఇలాంటివి కనపడవా అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

News March 21, 2025

కామారెడ్డి: 10 పరీక్షలు తొలి రోజు గైర్హాజరు ఎంతంటే..?

image

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ఉదయం 9:30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 12,579 మంది విద్యార్థులకు 12,552 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి రాజు తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రతో పాటు ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

News March 21, 2025

బిచ్కుంద: 2024లో హత్య.. నేడు అరెస్టు

image

హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బిచ్కుంద సీఐ నరేశ్ తెలిపారు. శుక్రవారం బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్‌లో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. బిహార్ చెందిన అంటుకుమార్ హస్గుల్‌లో మనీష్‌కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ పేర్కొన్నారు.

error: Content is protected !!