News March 29, 2025
సిరిసిల్ల: 6753 మంది విద్యార్థులు హాజరు

సిరిసిల్ల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలో 6,753 మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6,767 మంది విద్యార్థులకు గాను 6,753 మంది హాజరయ్యారని స్పష్టం చేశారు. 14 మంత్రి విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టేవారు: MP కావ్య

గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పొలాల్లో దిష్టిబొమ్మలకు కట్టే వారని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను అందిస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీలో ఎంపీ మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి రాజీపడబోమని, ప్రతి ఇంటికి వెలుగు చేరేలా, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
News November 23, 2025
గిరిజన దర్బారుకు సకాలంలో హాజరు కావాలి: పీవో రాహుల్

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు ఉదయం 10.30 గంటలకు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ఆదేశించారు. గిరిజనులు వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులను అందజేయాలని కోరారు.
News November 23, 2025
ఉమ్మడి జిల్లాలోనే మొదటి స్థానంలో ఘనపూర్: కడియం

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్లో చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తనకూ మహిళలు అంటే ప్రత్యేక అభిమానమని, ఎందుకంటే తనకు ముగ్గురు ఆడపిల్లలు, ఆరుగురు అక్కా చెల్లెళ్లు ఉన్నారన్నారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు కడియం అని పేర్కొన్నారు.


