News April 2, 2025

సిరిసిల్ల: 6753 మంది విద్యార్థుల హాజరు: DEO

image

సిరిసిల్ల జిల్లాలో ఏడోరోజు జరిగిన పదోతరగతి పరీక్షలకు 6753 మంది విద్యార్థులు హాజరైనట్టు సిరిసిల్ల డీఈవో జనార్దన్ రావు తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మొత్తం 6767 మంది విద్యార్థులకు 6753 మంది విద్యార్థులు హాజరైనట్టు ఆయన పేర్కొన్నారు. మొత్తం 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News September 14, 2025

ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

image

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.

News September 14, 2025

ములుగు : సీఎం రేవంత్‌కు మేడారం సెంటిమెంట్

image

మేడారం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన రాష్ట్రంలో చేసిన హాత్ సే హాత్ జోడో యాత్రను మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధానం నుంచి Feb 6, 2023లో ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర దోహదపడింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలిసారి 2024లో జరిగిన జాతరకు రూ.105కోట్లు ఇచ్చిన సీఎం ఈసారి రూ 236.2కోట్లతో మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్ల పరిశీలనకు స్వయంగా రానున్నారు.

News September 14, 2025

HYD: ట్రాఫిక్ సమస్యలు.. మెట్రో ఎక్కిన బీజేపీ చీఫ్

image

దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ HYDలో రోడ్లు, డ్రైనేజీ, ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు విమర్శించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో తాను మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు.