News February 26, 2026

సిరిసిల్ల : 68 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా మొదటిరోజు 3814 మంది విద్యార్థులకు గాను 3746 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు అధికారులు తెలిపారు. 68 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.

Similar News

News April 14, 2026

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ప్రత్యేక డిస్కమ్ హోదా

image

విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్‌కు ‘డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్’ హోదా ఇవ్వనుంది. దీనిపై త్వరలో అధికారిక GO వెలువడనుంది. ఈ హోదాతో గూగుల్ స్వయంగా విద్యుత్ కొనుగోలు చేసి పంపిణీ చేసుకునే అవకాశం పొందుతుంది. స్థానిక వినియోగదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

News April 14, 2026

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో జరిగే అంబేడ్కర్ జయంతి వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.40 గంటలకు SRM యూనివర్సిటీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఆయన తిరిగి తన నివాసానికి చేరుకుంటారు.

News April 14, 2026

కరీంనగర్‌లో అంబేడ్కర్ జయంతి.. వాహనాల మళ్లింపు

image

KNRలో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని CP గౌస్ ఆలం తెలిపారు. JGTL నుంచి వచ్చే భారీ వాహనాలను రేకుర్తి, SU, పద్మనగర్, రాంనగర్, తెలంగాణ చౌక్ మీదుగా మళ్లించనున్నామన్నారు. పెద్దపల్లి నుంచి వచ్చే భారీ వాహనాలు బొమ్మకల్ బైపాస్ నుంచి వెళ్లాలని, ప్రధాన కూడళ్లలో జనం రద్దీ దృష్ట్యా వాహనదారులు పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.