News December 29, 2024
సిరిసిల్ల: AR కానిస్టేబుల్ ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబ సభ్యులతో సిద్దిపేటలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ.. భార్య ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అనంతరం బాలకృష్ణ ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు భార్య పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News July 6, 2025
వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.
News July 5, 2025
చొప్పదండి: తైక్వాండో ఛాంపియన్లను అభినందించిన కేంద్రమంత్రి

చొప్పదండి పట్టణానికి చెందిన తైక్వాండో ఛాంపియన్లను కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం అభినందించారు. జూన్ 23 నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. పడకంటి కాశీ విశ్వనాద్, భూసారపు వెంకటేష్ గౌడ్, స్పందన, సౌమ్య, రామ్ చరణ్ అనే విద్యార్థులు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఏడు గోల్డ్, ఒకటి సిల్వర్, ఒకటి రజిత పథకాలు సాధించారు.
News July 4, 2025
బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.