News March 20, 2025

సిరిసిల్ల: CMR లక్ష్యం పూర్తిచేయాలి: అదనపు కలెక్టర్

image

బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు సీఎంఆర్ లక్ష్యం పూర్తిచేయాలని సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా లక్ష్యం పూర్తిచేయాలన్నారు. అలాగే ఆయా రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలను త్వరితగతిన అందజేయాలని స్పష్టం చేశారు.

Similar News

News November 16, 2025

గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

image

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.

News November 16, 2025

HYD: మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి!

image

మీ మొబైల్ పోయిందా? అశ్రద్ధ చేయకండి. వెంటనే CEIR పోర్టల్ ద్వారా మీ మొబైల్ వివరాలు నమోదు చేసి, స్థానిక పోలీస్ స్టేషన్లో అందించండి. పోలీసులు మీ మొబైల్ వెతికి మీకు అందిస్తారు. 2023 ఏప్రిల్ నుంచి 2025 అక్టోబర్ 16 వరకు పోలీసులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 84,003 ఫోన్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గుర్తించినవి 45,261 కాగా.. అందజేసినవి 14,965 ఉన్నట్లు పేర్కొన్నారు.

News November 16, 2025

టీమ్ ఇండియా చెత్త రికార్డు

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.