News February 19, 2025
సిరిసిల్ల: GOVT ఆఫీస్‌లో వ్యక్తి వీరంగం

సిరిసిల్ల రవాణా శాఖ కార్యాలయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం చేసి న్యూసెన్స్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారని డీటీవో లక్ష్మణ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసి నాగరాజ్‌కు సంబంధించిన లారీలు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయని, డీటీవో ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజ్ రవాణా శాఖ ఆఫీస్‌లో వీరంగం సృష్టించి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు డీటీవో తెలిపారు.
Similar News
News November 26, 2025
ప్రింటర్లకు నోటీసులు జారీ చేయాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రింటర్లకు నోటిసులు జారీ చేయాలని, అనుమతి లేకుండా ఎటువంటి రాజకీయ సంబంధ నోటిసులు ముద్రణ చేయవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. ఎన్నికల సంబంధించి బిల్లులు వెంటనే సమర్పించాలని, కలెక్టరేట్లో జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ సామాగ్రి మండల స్థాయిలో అందుబాటులో పెట్టాలని పేర్కొన్నారు.
News November 26, 2025
ఇప్పుడెందుకు క్రెడిట్ తీసుకుంటున్నావ్.. గంభీర్‌పై నెటిజన్ల ఫైర్

‘నా హయాంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచింది’ అని గంభీర్ చేసిన <<18393677>>తాజా కామెంట్లపై<<>> నెటిజన్లు మండిపడుతున్నారు. ‘2011 WC ఒక్కరి వల్లే గెలవలేదు. టీమ్, సపోర్ట్ స్టాఫ్ కృషి వల్లే అది సాధ్యమైంది. ఒక్క సిక్సర్ (ధోనీ కొట్టిన విన్నింగ్ షాట్)కు అంత ప్రాధాన్యం ఎందుకు?’ అని 2020లో గౌతీ ట్వీట్ చేశారు. ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తూ ‘మరి ఇప్పుడెందుకు క్రెడిట్ తీసుకుంటున్నావ్’ అని ఫైరవుతున్నారు.
News November 26, 2025
జగిత్యాలలో మొత్తం ఓటర్లు 6,07,263 లక్షల మంది

జగిత్యాల జిల్లాలో మొత్తం 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది మహిళలు, 9 మంది ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం విశేషమన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు.


