News February 19, 2025
సిరిసిల్ల: GOVT ఆఫీస్‌లో వ్యక్తి వీరంగం

సిరిసిల్ల రవాణా శాఖ కార్యాలయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం చేసి న్యూసెన్స్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారని డీటీవో లక్ష్మణ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వాసి నాగరాజ్‌కు సంబంధించిన లారీలు ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయని, డీటీవో ఆ వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన నాగరాజ్ రవాణా శాఖ ఆఫీస్‌లో వీరంగం సృష్టించి ఫర్నిచర్ ధ్వంసం చేసినట్లు డీటీవో తెలిపారు.
Similar News
News April 17, 2026
ఇచ్చేయండి సార్.. షరీఫ్‌కు నోబెల్ ఇవ్వాలంటూ పాక్‌లో తీర్మానం!

‘నోబెల్’ విషయంలో ట్రంప్‌కు పాక్ పోటీ ఇస్తోంది. తమ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు పీస్ ప్రైజ్ ఇవ్వాలన్న మీడియా <<19605334>>ప్రచారానికి<<>> పంజాబ్ అసెంబ్లీ వంతపాడింది. యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలకు వారికి ఇవ్వాల్సిందేనని తీర్మానం చేసింది. పాక్‌లో జరిగిన చర్చలు ఫలించలేదు. కానీ ట్రంప్ తాను <<19668983>>10వ వార్<<>> ఆపబోతున్నానని మళ్లీ నోబెల్ రేసులోకొచ్చారు. మరి పాక్ కథ ట్రంప్ చెవిన పడిందో లేదో!
News April 17, 2026
3,106 చెరువుల్లో ఉపాధి పనులు: చిత్తూరు కలెక్టర్

‘జలధార-నీటి భద్రత’ పనులతో చిత్తూరు జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 3,106 చెరువుల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టాలని సూచించారు. నీటి నిల్వలు పెంపు, సాగునీటి బలోపేతం, కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్‌కు 3 చెరువులు కేటాయించి, అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.
News April 17, 2026
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: SP సుబ్బరాయుడు

సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని తిరుపతి SP సుబ్బరాయుడు సూచించారు. గురువారం SP కార్యాలయం నుంచి బ్యాంకర్లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, లింకులను నమ్మవద్దని కోరారు. OTP, పిన్ నంబర్లు, బ్యాంక్ వివరాల వంటి గోప్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దని సూచించారు.


