News March 11, 2025
సిరిసిల్ల: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి (UPDATE)

సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్<<15719179>> కమాండెంట్<<>> టి.గంగారం(55) లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగేసి ప్రమాదవశాత్తు సోమవారం రాత్రి చనిపోయిన విషయం తెలిసిందే. స్నేహితుడు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ను కలిసేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్పై పడి చనిపోయారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం ఆయన స్వస్థలం.
Similar News
News November 27, 2025
NZB: 34 మందికి రూ.3.35 లక్షల జరిమానా

నిజామాబాద్ కమీషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 34 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారికి రూ.3.35 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.
News November 27, 2025
కృష్ణా: సొంతిల్లు లేదా.. మూడు రోజులే గడువు త్వరపడండి.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇల్లులేని 22,694 కుటుంబాలకు (NTRలో 15,994, కృష్ణాలో 6,700) PM AWAS+ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇంటి నిర్మాణానికి రూ.1.59 లక్షలు ఇస్తోంది. మొత్తం రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు సాయం అందనుంది. అర్హత ఉన్న పేదలు తమ వివరాలను సచివాలయాల్లో నమోదు చేసుకోవడానికి NOV 30వ తేదీ చివరి గడువని అధికారులు స్పష్టం చేశారు.
News November 27, 2025
సిరిసిల్ల జిల్లాలో తొలి రోజు 42 సర్పంచ్ నామినేషన్లు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 42, వార్డు సభ్యుల స్థానాలకు 32 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలి రోజు గురువారం రుద్రంగి మండలంలో సర్పంచ్ 4, వార్డు 5, వేములవాడ అర్బన్ మండలంలో సర్పంచ్ 2, వేములవాడ రూరల్ మండలంలో సర్పంచ్ 7, వార్డు 4, కోనరావుపేట మండలంలో సర్పంచ్ 16, వార్డులకు 12, చందుర్తి మండలంలో సర్పంచ్ 13, వార్డు స్థానాలకు 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి.


