News March 11, 2025

సిరిసిల్ల: TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ మృతి

image

సిరిసిల్ల జిల్లా TGSP 17వ బెటాలియన్ కమాండెంట్ టి.గంగారం(55) లిఫ్ట్‌ వచ్చిందనుకుని లోపలికి అడుగేసి ప్రమాదవశాత్తు కిందపడి సోమవారం రాత్రి చనిపోయారు. స్నేహితుడు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ను కలిసేందుకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మూడో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌‌పై పడి మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామం ఆయన స్వస్థలం.

Similar News

News November 20, 2025

భిక్కనూర్: బొట్టు పెట్టి చీరలు అందజేయాలి: మంత్రి

image

భిక్కనూర్‌లో గురువారం మంత్రి సీతక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారురాలికి తప్పనిసరిగా చీర అందేలా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బొట్టు పెట్టి, చీరలను గౌరవప్రదంగా అందజేయాలని సూచించారు.

News November 20, 2025

HYD: మెట్రోలో వారి కోసం ప్రత్యేక స్కానింగ్

image

మెట్రోలో భద్రత మా ప్రాధాన్యం అని HYD మెట్రో తెలిసింది. ప్రతి స్టేషన్‌లో ఆధునిక సీసీటీవీ నిఘా, కఠిన భద్రతా తనిఖీలు అమలు చేస్తూ ప్రయాణికుల రక్షణను మరింత బలపరుస్తున్నట్లు తెలిపింది. పేస్‌మేకర్లు, గుండె రోగులు, గర్భిణీలకు పూర్తిగా సురక్షితమైన స్కానర్లు ఏర్పాటు చేయడం మెట్రో భద్రతా ప్రమాణాలకు నిదర్శనంగా పేర్కొంది.

News November 20, 2025

HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

image

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.