News December 30, 2024
సిరిసిల్ల: UPDATE.. అప్పుల బాధతో కానిస్టేబుల్ సూసైడ్

గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ సిద్దిపేటలో <<15009544>>కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం<<>> చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పుల బాధతో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతడి భార్య మానస పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.25 లక్షలు అప్పులు చేసి ప్రైవేటు కంపెనీలలో పెట్టుబడి పెట్టినట్లు తనకు చెప్పారని పేర్కొంది. అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది.
Similar News
News October 13, 2025
JMKT: భారీగా తరలివచ్చిన పత్తి.. తగ్గిన ధర..!

రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు పత్తి భారీగా తరలివచ్చింది. రైతులు 174 వాహనాల్లో 1408 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ.6,400 ధర పలికింది. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 43 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ.6,200 ధర లభించింది. గతవారం కంటే పత్తి ధర తాజాగా రూ.400 తగ్గింది.
News October 13, 2025
HZB: ఈనెల 17న స్పెషల్ యాత్రా బస్సు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హుజూరాబాద్ డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 17న ఉదయం 5 గంటలకు లక్నవరం, రామప్ప, మేడారం, మల్లూరు నరసింహస్వామి ఆలయాలకు ఒకరోజు యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెద్దలకు రూ.800, పిల్లలకు రూ.430 టికెట్ చార్జీలతో స్పెషల్ బస్సు వెళుతుందన్నారు. అడ్వాన్స్ బుకింగ్ కోసం 9959225924, 9704833971 నంబర్లను సంప్రదించాలన్నారు.
News October 13, 2025
KNR: TRSMA రాష్ట్ర కన్వీనర్‌గా సౌగాని కొమురయ్య

తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) రాష్ట్ర కన్వీనర్‌గా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద విద్యా సంస్థల అధినేత సౌగాని కొమురయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కొమురయ్య మాట్లాడుతూ.. తనను రాష్ట్ర కన్వీనర్‌గా నియమించేందుకు సహకరించిన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి కోసం, TRSMA లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తానని మాటిచ్చారు.