News April 8, 2025
సిరిసిల జిల్లాలో విషాదం.. తల్లీకొడుకు మృతి

తల్లీకొడుకు మృతితో రుద్రంగిలో ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆదివారం పుష్పలత(35) చనిపోగా.. సోమవారం కొడుకు నిహాల్ తేజ్(6) మృతిచెందాడు. దీంతో మృతురాలి బంధువులు అత్తింటిపై దాడి చేశారు. తమ కూతురు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోలేదన్నారు. న్యాయం జరిగేలా చూస్తామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు హామీతో శాంతించారు. శుక్రవారం రాత్రి చపాతి తిన్న ఇరువురు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Similar News
News December 10, 2025
టీడబ్ల్యుజేఎఫ్ ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ ఏకగ్రీవం

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్‌గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్‌ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
News December 10, 2025
HYD: అటూ ఇటూ కాకుండా పోయాం సారూ..!

గ్రేటర్ HYD ORR వరకు విస్తరించాక మహా GHMCగా మారింది. అయితే.. విలీన ప్రాంతాల్లో ఏర్పడుతున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాల్టీలకు కాకుండా, GHMC హెల్ప్‌లైన్, ఆన్‌లైన్‌లో తమ వినతులకు స్పందనరాక అటూ ఇటూ కాకుండా పోయామని వాపోతున్నారు. ఇది శాఖలు, అధికార బదీలలపై సమన్వయ లోపమా అని నిలదీస్తున్నారు. తమ మేలుకోసమే జరిగిందనే ఈ విలీనంలో ఇబ్బందులు తెలత్తకుండా చూడాలని కోరుతున్నారు.
News December 10, 2025
ఏలూరులో AI ల్యాబ్‌లు: MP

ఏలూరు పార్లమెంట్ పరిధిలో 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు MP పుట్టా మహేశ్ కుమార్ చర్యలు చేపట్టారు. ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటు ఖర్చు సమకూర్చాలని ONGC సంస్థతో మాట్లాడి ఒప్పించినట్లు పేర్కొన్నారు. MP విజ్ఞప్తి మేరకు CSR కింద ఏఐ కంప్యూటర్ ల్యాబుల ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.


