News February 12, 2025
సిర్గాపూర్: క్యాన్సర్‌తో యువకుడి మృతి

సిర్గాపూర్ మండలం జమ్లా తండా గ్రామపంచాయతీ పరిధిలోని జీవులనాయక్ తండాకు చెందిన యువరైతు వడిత్య శ్రీనివాస్(29) క్యాన్సర్ వ్యాధితో మృతి చెందాడు. యువకుడు గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మరణించినట్లు చెప్పారు. కాగా, మృతుడికి ఏడాది కిందటే పెళ్లైనట్లు సమాచారం. యువకుడి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News March 18, 2025
అమలాపురం: ఏటిగట్ల నిర్మాణం, బలోపేతానికి చర్యలు

కోనసీమ జిల్లా సెంట్రల్ డెల్టాలో భౌగోళిక పరిస్థితులు భూసారాలు స్థితిగతులు దృష్టిలో ఉంచుకొని రహదారుల నిర్మాణం, ఏటిగట్ల బలోపేతానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రహదారులు, కాలువలు, ఏటిగట్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు.
News March 18, 2025
ముగిసిన పోసాని సీఐడీ కస్టడీ

AP: సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి ఒక రోజు సీఐడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని ఈ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. మరోసారి ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది.
News March 18, 2025
కొండగట్టులో గుర్తుతెలియని కుళ్ళిన మృత దేహం

గుర్తుతెలియని కుళ్ళిన మృతదేహం లభ్యమైన ఘటన కొండగట్టు దిగువ ప్రాంతంలోని తుమ్మచెరువు ప్రాంతంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న మల్యాల ఎస్సై నరేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు 20 రోజుల క్రితం మృతి చెందడంతో శవం పూర్తిగా కుళ్లిపోయి అస్తిపంజరంగా మారింది. మృతిచెందిన వ్యక్తి ఎవరు.. ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది.