News February 24, 2025
సిర్పూర్(టి): అప్పు తీర్చలేక వ్యక్తి సూసైడ్

సిర్పూర్(టి) పెద్ద బండ సమీపంలోని భీమన్న ఆలయం వద్ద ఓ వ్యక్తి ఆదివారం చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడు కాగజ్నగర్లోని కాపు వాడకు చెందిన వెంకటేశ్గా పోలీసులు గుర్తించారు. మద్యం షాపు టెండర్ల కోసం అప్పు చేశాడని, అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Similar News
News December 1, 2025
CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
News December 1, 2025
అర్జీలు రీ-ఓపెన్ కాకూడదు: అధికారులకు కలెక్టర్ ఆదేశం

విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా 237 వినతులు స్వీకరించారు. ఒకే సమస్యపై అర్జీలు మళ్లీ ‘రీ-ఓపెన్’ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో తప్పనిసరిగా ఫోన్లో మాట్లాడాలని సూచించారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూ, జీవీఎంసీ సమస్యలే ఎక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 1, 2025
వనపర్తి: మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా అప్పగించాలి

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్.)ను ఎప్పటికప్పుడు వేగంగా పూర్తి చేసి ప్రభుత్వానికి డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం మదనాపురం మండల పరిధిలోని భాను ట్రేడర్స్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలను అదనపు కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.


