News January 13, 2025
సిర్పూర్(టి): పశువుల రవాణా.. ముగ్గురి ARREST

అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
ఉట్నూర్: 9 నుంచి జాతర క్రీడాపోటీలు

ఉట్నూర్ మండలంలోని శ్యామ్ పూరులో బుడుందేవ్ జాతర అంగరంగవైభవంగా కొనసాగుతుంది. ఈ నెల 9 నుంచి 10వ తేదీ వరకు రెండు రోజుల పాటు కబడ్డీ, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నట్లు మేనేజిమెంట్ సభ్యుడు పెందూర్ రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. గెలుపొందిన వారికీ బహుమతులు అందజేస్తామన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు హాజరుకావాలని వారు కోరారు.
News February 7, 2025
ADB:చైన్ దొంగలించబోయి దొరికిపోయాడు!

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మాధస్తు మహేందర్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి వాళ్ల బంధువులను చూడడానికి గురువారం సాయంత్రం వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏమాయికుంటకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి విజయలక్ష్మి మెడలోని గొలుసును లాక్కునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు దొంగ దొంగ అని అరవడంతో పారిపోగా..సెక్యూరిటీ పట్టుకొని పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు రిమాండ్‌కు టూ టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు.
News February 7, 2025
ఆదిలాబాద్: బొలెరో వాహనం ఢీ.. ముగ్గురికి గాయాలు

ఆదిలాబాద్‌లో గురువారం రాత్రి బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు గాయాలపాలయ్యారు. స్థానికులు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంకోలి రోడ్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న ఒక కారును ఢీకొనడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వారిని ఢీకొంది. దీంతో భీంపూర్ మండలంకు చెందిన గణేష్, ఆదిలాబాద్‌కు చెందిన వెంకట్, నితిన్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు.