News March 5, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి ఏడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న కేసులో వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష రూ.50వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. సిర్పూర్(యు) ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. 24.10.2021న నమ్మదగిన సమాచారం మేరకు మధురతండాకు చెందిన భానుదాస్(29) గంజాయి సాగు చేస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News October 26, 2025
ఖమ్మం: మనోళ్లు జూబ్లీహిల్స్లో బిజీ

జూబ్లీహిల్స్లో ఖమ్మం నాయకులు బిజీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల స్టార్ క్యాంపెయినర్లుగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు క్యాంపెయిన్ చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధుకు బీఆర్ఎస్ ప్రచార బాధ్యతలు అప్పగించింది.
News October 26, 2025
SPMVV: ప్రవేశాలకు మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభం

SPMVVలో UG/ PG కోర్సుల్లో మూడో విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని కార్యాలయం పేర్కొంది. మొదటి రెండు విడతల్లో సీట్లు పొందని వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. B.Voc ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూట్రిషన్ హెల్త్ కేర్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు నేటి(ఆదివారం)లోగా https://oamdc-apsche.aptonline.in/OAMDC202425/Index పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News October 26, 2025
ఏలూరు: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో ఏలూరు రూరల్ మారుతీ నగర్కు చెందిన కూలీ సుందరమతి దుర్గారావు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు. 15 రోజుల కిందట భార్య పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లగా, మనస్తాపంతో శనివారం రాత్రి దుర్గారావు ఇంటి వద్ద ఉరి వేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ తెలిపారు.


