News March 5, 2025
సిర్పూర్(యు): గంజాయి సాగు చేస్తున్న వ్యక్తికి ఏడేళ్ల జైలు

గంజాయి సాగు చేస్తున్న కేసులో వ్యక్తికి 7 సంవత్సరాల జైలు శిక్ష రూ.50వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పు ఇచ్చారు. సిర్పూర్(యు) ఎస్ఐ రామకృష్ణ కథనం ప్రకారం.. 24.10.2021న నమ్మదగిన సమాచారం మేరకు మధురతండాకు చెందిన భానుదాస్(29) గంజాయి సాగు చేస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News April 13, 2026
అనకాపల్లిలో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

పద్మం సిల్వర్ జువెలరీ మరొక శాఖను అనకాపల్లిలో ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి CMR గ్రూపు ఛైర్మన్ మావూరి వెంకటరమణ, మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు, ఏపీ యుఎఫ్ఐ డీసీ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పద్మం సిల్వర్ జువెలరీ వారు తమ మరో శాఖను అనకాపల్లిలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రారంభోత్సవ సందర్భంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందించడం ఎంతో హర్షణీయమని వీరభద్ర రావు అన్నారు.
News April 13, 2026
చిత్తూరు జిల్లాలో రైతు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.
News April 13, 2026
కామారెడ్డి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడంటే?

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. 7 ప్రాంతాలు ఎల్లో జోన్ లో ఉండగా మిగతా ప్రాంతాలన్నీ 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎల్పుగొండ, బిచ్కుంద, బొమ్మన్ దేవిపల్లిలో 41.6°C, మాచాపూర్, మేనూర్ 41.5, కొల్లూరు 41.4, పిట్లం 41.3, లింగంపేట, మాక్డూంపూర్, నాగిరెడ్డిపేట 41.2, IDOC(కామారెడ్డి), దోమకొండ 41.1°C నమోదయ్యాయి.


