News January 27, 2025
సిర్పూర్ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుపై కాగజ్నగర్ పట్టణవాసులు సీఐ రాజేంద్రప్రసాద్ కు ఆదివారం ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించకుండా అగౌరవపరిచారన్నారు. అధికారిక నివాసంపై ఉన్న జాతీయ జెండా రంగు తేలినా మార్చకుండా అవమానపరిచారని తెలిపారు. జాతీయ జెండాను అగౌరవపరిచినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 23, 2025
వాహనదారులకు ప్రకాశం పోలీస్ కీలక సూచనలు.!

*హైవేల్లో భారీ ప్రమాదాలకు కారణం నిద్ర మత్తు
*నిద్రమత్తు వల్లే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ
*మీతోపాటు ప్రయాణికుల, పాదచారుల ప్రాణాలకు ముప్పు
*నిద్రమత్తు అనిపిస్తే వెంటనే వాహనం సైడుకు ఆపి 10-20 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి
*ప్రయాణం మొదలు పెట్టే ముందు సరిపోయేలా నిద్రపోవాలి
*దీర్ఘ ప్రయాణాల్లో 2 గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకోండి.
*వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించండి.
News November 23, 2025
మెదక్: నేడు NMMS పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
News November 23, 2025
మహబూబాబాద్లో మహిళలకు అధ్యక్ష పదవులు!

మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా మాలోత్ కవిత బాధ్యతలు చేపడుతుండగా, కాంగ్రెస్ అధిష్టానం సైతం డీసీసీ అధ్యక్షురాలిగా భూక్య ఉమాను నియమించింది. ఇద్దరు ఎస్టీ మహిళలను అధ్యక్షులుగా నియమించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాముఖ్యత పెరిగింది.


