News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
Similar News
News December 29, 2024
సిర్పూర్(టి): పెద్దపులి సంచారం కలకలం
సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్‌లోని ప్లాంటేషన్‌లో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించి గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఉదయం 10 దాటాక వెళ్లి సాయంత్రం 4 లోపే ఇంటికి చేరుకోవాలన్నారు.
News December 28, 2024
ADB: ఆదివారం కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులు
డా. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3 ,5 సెమిస్టర్ విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులను ఈనెల 29న ఆదిలాబాద్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ శనివారం పేర్కొన్నారు. పీజీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
News December 28, 2024
ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు
ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.