News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
Similar News
News January 20, 2025
NRML: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
NRML జిల్లా <<15204489>>బాసర గోదావరి<<>> నదిలో దూకి శివరాం(62) మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2ఏళ్ల కింద మరణించారు. మనస్తాపం చెందిన శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసరకు వచ్చి గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
News January 20, 2025
రేపు ఆదిలాబాద్ ఆకాశవాణిలో ఫోన్ ఇన్
ADB ఆకాశవాణి కేంద్రంలో మంగళవారం “కీరదోస సాగులో మెళకువలు” గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.వి.మురళీతో ఫోన్ఇన్ నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ తెలిపారు. రైతులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆయన సమాధానిలిస్తారని పేర్కొన్నారు. రైతులు మంగళవారం రాత్రి 7.15 నుంచి 7.45 వరకు 08732-295081, 230081 నంబర్లలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
News January 20, 2025
ఇంద్రవెల్లి: ప్రకృతి ప్రేమికులు ఆదివాసులు
ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.