News April 5, 2025

సిర్పూర్ (టి): పెనుగంగలో వ్యక్తి మృతదేహం

image

సిర్పూర్ (టి) మండలం టోంకిని గ్రామ సమీపంలోని పెన్ గంగలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 ఉంటుందని, సమాచారం తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 9, 2025

IPL: స్టేడియంలో చాహల్ గర్ల్ ఫ్రెండ్ సందడి

image

సీఎస్కే-పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహ్వాష్ సందడి చేశారు. పంజాబ్ వికెట్లు తీసినప్పుడు ఆమె స్టాండ్స్‌లో ఎగిరి గంతులేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాహల్‌తో కలిసి మహ్వాష్ ఓ మ్యాచ్ కూడా తిలకించారు.

News April 9, 2025

ట్రంప్ టారిఫ్స్.. భారత్ -చైనా ఏకమవ్వాలి: చైనా

image

ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి చేకూర్చేదిగా ఉంటుందని తెలిపారు. ఈ రెండు దేశాలు కలిసి నిలబడితే USA సుంకాల వల్ల ఇబ్బందులు ఉండవన్నారు. కాగా అమెరికాపై విధిస్తున్న సుంకాలను రద్దు చేయాలని చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇవ్వగా..డ్రాగన్ దేశం లెక్కచేయలేదు.

News April 9, 2025

IPL: చెన్నైకు మరో ఓటమి

image

CSKతో మ్యాచులో 18 రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నై 201-5 స్కోరుకు పరిమితమైంది. ధోనీ(27) పోరాడినా ఆ జట్టుకు మరో ఓటమి తప్పలేదు. కాన్వే (69), దూబే (42), రచిన్ (36) రన్స్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య (103) సెంచరీతో అదరగొట్టారు. ఈ సీజన్‌లో PBKSకు ఇది మూడో విజయం. చెన్నైకు నాలుగో ఓటమి.

error: Content is protected !!