News July 26, 2024
సిర్పూర్ (టి): వరదలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించిన పోలీసులు

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెనుగంగా వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాలు.. సిర్పూర్ (టి) మండలం హుడ్కిలి గ్రామం వద్ద పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ పైన గోపాల్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ దీకొండ రమేశ్ తన సిబ్బందితో వెళ్లి అతడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.
Similar News
News February 26, 2026
‘బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు పునరంకితం కావాలి’

ఆదిలాబాద్ జిల్లాను బాల్యవివాహ రహితంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. బాల్యవివాహ నిరోధక అధికారులకు నిర్వహించిన అభయ అవగాహన సదస్సును ఆయన ప్రారంభించారు. గ్రామ, పట్టణాలలో బాలల సంరక్షణ కమిటీలు ప్రతినెలా విధిగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా నిలిపేందుకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ కోరారు.
News February 26, 2026
ఆదిలాబాద్‌లో SSC విద్యార్థులకు గ్రాండ్ ప్రాక్టీస్ టెస్టులు

ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థుల కోసం గ్రాండ్ టెస్టుల షెడ్యూల్‌ను జిల్లా విద్యాశాఖ విడుదల చేసింది. మార్చి 2 నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు ప్రత్యేక తేదీలను కేటాయించారు. ఈ పరీక్షల ద్వారా విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు మరింత మెరుగ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
News February 26, 2026
ADB: 369 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ జాదవ్ గణేష్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.


