News February 14, 2025
సిర్పూర్ (టీ): విధులను బహిష్కరించిన న్యాయవాదులు

సిర్పూర్ టీ జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు మహిళా న్యాయమూర్తి హరీషపై నిందితుడు కిరణ్ సింగ్ చెప్పు విసిరినందుకు నిరసనగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ప్రధాన కార్యదర్శి గణపతి న్యాయవాదులు రైస్ అహ్మద్, శంకర్‌రావు, దయరాజ్ సింగ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్‌లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
News December 4, 2025
RJY: 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.


