News February 14, 2025

సిర్పూర్ (టీ): విధులను బహిష్కరించిన న్యాయవాదులు

image

సిర్పూర్ టీ జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు మహిళా న్యాయమూర్తి హరీషపై నిందితుడు కిరణ్ సింగ్ చెప్పు విసిరినందుకు నిరసనగా విధులను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ప్రధాన కార్యదర్శి గణపతి న్యాయవాదులు రైస్ అహ్మద్, శంకర్‌రావు, దయరాజ్ సింగ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Similar News

News March 27, 2025

రైల్వే కోడూరు: గంగమ్మ జాతరలో విషాదం

image

రైల్వే కోడూరు పట్టణంలో జరుగుతున్న బలిజపల్లి గంగమ్మ జాతరలో విషాదం చోటుచేసుకుంది. కొత్త కోడూరు గంగమ్మ ఆలయ వ్యవస్థాపకుడు ప్రధాన ధర్మకర్త చెన్నం శెట్టి కుమార్ డప్పులు వాయిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుమార్ మృతితో కొత్తకోటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 27, 2025

ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

image

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.

News March 27, 2025

అనకాపల్లి జిల్లాలో నేడు తీవ్ర వడగాడ్పులు.. వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో గురువారం రెండు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ తెలిపారు. ఇదిలావుండగా బుధవారం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల 39 డిగ్రీల పైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్‌ సూచించారు.

error: Content is protected !!