News March 24, 2025
సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతోనే పేలుడు..

కర్నూలు జిల్లా ఆలూరు మం. కురవల్లి గ్రామంలో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సిలిండర్ పూర్తిగా ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీకైంది. ఉదయం లైటు స్విచ్ వేయగానే ఒక్కసారిగా సిలిండర్ పేలిందని ఎస్సై మహబూబ్ బాషా తెలిపారు. ప్రమాదంలో దంపతులు గురుస్వామి, గాయత్రి, వారి కుమారుడు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
Similar News
News November 12, 2025
జమ్మూకశ్మీర్లో 500 ప్రాంతాల్లో పోలీసుల దాడులు

ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఏకంగా 500 లొకేషన్లలో రెయిడ్స్ చేపట్టారు. జమాతే ఇస్లామీ(JeI), ఇతర నిషేధిత సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, టెర్రరిస్టు సహాయకులకు చెందిన ప్రాంతాలు వీటిలో ఉన్నాయి. JeI అనుబంధ టెర్రరిస్టులు తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం వచ్చిందని అధికారులు తెలిపారు.
News November 12, 2025
కానూరులో భారీగా గంజాయి పట్టివేత

విజయవాడలోని కానూరులో బుధవారం పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రూ. 50 లక్షలు విలువ చేసే 249 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈగల్ & రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా జరిపిన దాడులలో ఉత్తరప్రదేశ్ నుంచి ఒడిశాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇద్దరు విజయవాడ, ముగ్గురు ఒడిశాకు చెందిన మొత్తం ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News November 12, 2025
ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతాం: కేంద్రం

ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర క్యాబినెట్ సంతాపం తెలిపింది. ఇది ఉగ్రవాద చర్య అని అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదులను చట్టం ముందు నిలబెడతామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ‘దర్యాప్తును అత్యవసరంగా నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఉగ్రవాదులు, వారి స్పాన్సర్లను గుర్తించి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించింది’ అని తెలిపారు. పరిస్థితిని అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.


