News February 27, 2025
సిల్వర్ మోడల్ సాధించిన NZB అమ్మాయి

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సంహిత హర్యానాలో జరిగిన నెట్‌బాల్ పోటీల్లో విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన కుమారి సంహితను సిల్వర్ మోడల్‌తో సత్కరించారు. వినాయక్ నగర్‌లోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. చిన్న వయసులోనే తెలంగాణ నుంచి నెట్‌బాల్ క్రీడా విభాగంలో మెడల్ సాధించిన జట్టు క్రీడాకారులందరిని జిల్లా క్రీడాధికారి ముత్తన్న బుధవారం అభినందించారు.
Similar News
News March 24, 2025
నిజామాబాద్: మళ్లీ పెరిగిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మళ్లీ పెరిగింది. ఉదయం పూట చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఆదివారం కోటగిరి మండల కేంద్రంలో 41℃ ఉష్ణోగ్రత, ముగ్పాల్ మండలంలోని మంచిప్పలో 40.6, కమ్మర్పల్లి, మెండోరా మండల కేంద్రంలో 40.1℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.
News March 24, 2025
సాలూర: చెరువులో పడి యువకుడు మృతి

సాలూర మండలం జాడి జమాల్పూర్ గ్రామానికి చెందిన మోతేవార్ రమేశ్(26) చెరువులో పడి మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డ వివరాలు.. రమేశ్ పొలానికి వెళ్లి తిరిగి ఇంటికెళ్తుండగా మార్గమధ్యంలో కాలకృత్యాలు చేసుకొని స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతుడి తండ్రి నాగనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
News March 23, 2025
నిజామాబాద్‌లో పలువురి ఘర్షణ

నిజామాబాద్ నగరంలో ఆదివారం కలకలం చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరగగా కత్తి పోట్లు జరిగాయని పుకార్లు షికార్లు చేశారు. వివరాల్లోకి వెళితే మిర్చి కాంపౌండ్‌లో హబీబ్ నగర్‌కు చెందిన మహమ్మద్‌కు మిర్చీ కాంపౌండ్‌కు చెందిన అజ్జుకు, మరో వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాటలో మహమ్మద్‌కు అక్కడ ఉన్న ఓ ఇనుప రాడ్డు గుచ్చుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.