News April 17, 2024
సివిల్స్‌లో సిక్కోలు కుర్రోడు సత్తా
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్‌లో సత్తా చాటాడు. NITలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకుని 467 ర్యాంకు సాధించి ఔరా అనిపించారు. వెంకటేష్ తండ్రి చంద్రరావు, తల్లి రోహిణి వ్యవసాయం చేస్తూ.. గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తున్నారు. రెండో కుమారుడు వంశీ శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా చేస్తున్నాడు.
Similar News
News November 28, 2024
SKLM: కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ప్రతీ మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కంట్రోల్ రూం ఫోన్ నంబర్ 08942-240557 ఏర్పాటు చేసినట్లు అలాగే డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూంలు సిద్ధం చేసినట్లు వివరించారు.
News November 28, 2024
SKLM: పులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి
సంతబొమ్మాళి మండలంలో పులి సంచారం సమాచారంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందిందని అధికారులు తెలపడంతో ఆయన అధికారులతో మాట్లాడారు. అటవీ శాఖ అధికారులతో ఆయన సమాచారం ఆరా తీశారు. పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని, ఒడిశా నుంచి పులి టెక్కలి వైపు వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు. అక్కడి ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
News November 28, 2024
పోతినాయుడుపేట వద్ద పులి సంచారం.. ఆవుపై దాడి
సంతబొమ్మాళి మండలం మూలపేట పంచాయితీ పోతినాయుడుపేట వద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని గుర్తించడం జరిగిందని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ జి జగదీశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున గ్రామంలో ఆవుపై దాడి చేయడంతో అది మృతి చెందిందని తెలిపారు.పులి సంచారంపై గురువారం గ్రామస్థులకు అవగాహన కల్పించామని చెప్పారు. రాత్రి వేళలో ఎవరు బయటకు రావద్దు అంటూ సూచించారు.