News June 16, 2024
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలకు సర్వం సిద్ధం: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు-2024ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉన్న ప్రశ్న పత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. జూన్ 16వ తేదీన 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 1, 2025
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి కేశవ్

ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదిగవి గ్రామ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. గంటపాటు విద్యార్థులకు పాఠం చెప్పారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సమాధానం ఇచ్చారు. విద్యార్థుల తెలివితేటలను చూసిన మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలలో అధిరోహించాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
News November 30, 2025
2,81,298 మందికి పెన్షన్ పంపిణీ పంపిణీకి సిద్ధం: కలెక్టర్

అనంతపురం జిల్లాలో 2,81,298 మంది NTR భరోసా సామాజిక భద్రత ఫించన్ దారులకు రూ.125.39 కోట్లు పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 6:30 గంటలకు పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ ఉద్యోగస్థులు పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. పెన్షన్ పంపిణీ విధానాన్ని DLDO, MPDO, మున్సిపల్ కమిషనర్లు పరిరక్షించాలని ఆదేశించారు.


