News March 11, 2025

సీఆర్డీఏ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు

image

వెలగపూడిలోని అసెంబ్లీలోని ఛాంబర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు విషయాలపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పొంగూరు నారాయణ, కేశవ్ పయ్యావుల, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

GNT: జిల్లా గ్రంథాలయ సంస్థలకు జాయింట్ కలెక్టర్లు ఇన్‌ఛార్జ్‌లు

image

రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల వ్యవహారాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలోనూ జాయింట్ కలెక్టర్లను ఇన్‌ఛార్జ్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 6 నెలల పాటు లేదా కొత్త ఛైర్మన్ నియామకం వరకు అమల్లో ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీస్ చట్టం 1960 ప్రకారం ఈ ఉత్తర్వులను గవర్నర్ ఆమోదించారు.

News November 20, 2025

చేపలకోసం వల వేస్తే.. చిక్కిన కొండచిలువ

image

చేపల కోసం ఓ జాలరి వేసిన వలలో చేపలకు బదులు కొండచిలువ పడిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి పంప్ హౌస్ వద్ద బకింగ్ కెనాల్ కాలువలో గురువారం ఓ జాలరి చేపలు పట్టేందుకు కృష్ణా నదిలోకి వల వేయగా కొద్దిసేపటికి వల బరువుగా తగిలింది. దీంతో చేపలు బాగా పడ్డాయి అనుకుంటూ వలనిపైకి తీసి చూడగా అందులో ఉన్న కొండచిలువను చూసి ఒక్కసారిగా అవాకయ్యాడు. తాను ఎప్పుడూ ఇలా పాము రావడం చూడలేదని జాలరి చెప్పాడు.

News November 20, 2025

ANU: ‘మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే గుర్తింపు రద్దు’

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు, పల్నాడు జిల్లాలోని కొన్ని కాలేజీలలో మంగళవారం నుంచి జరుగుతున్న PG, ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరుగుతుందన్న ప్రచారంపై గురువారం యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు స్పందించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నమన్నారు. మాస్ కాపీయింగ్‌కి సహకరిస్తే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామన్నారు.