News February 13, 2025
సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే చర్యలు: పౌరసరఫరాల శాఖ

బకాయి సీఎంఆర్ బియ్యం ఇవ్వకుంటే ఆస్తులు జప్తు చేస్తామని వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎం జగన్మోహన్ హెచ్చరించారు. సీఎంఆర్ బియ్యం ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం మిల్లు యజమాని, మిల్లుకు జామీను ఉన్న వారి ఆస్తులు జప్తు చేస్తామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు నడుచుకోవాలని అన్నారు. లేదంటే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 17, 2025
సిరిసిల్ల: ‘పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పరచాలి’

పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు VPO వ్యవస్థ కలిగి ఉండాలని సిరిసిల్ల SP మహేష్ బీ గీతే అన్నారు. సిరిసిల్లలోని SP కార్యాలయంలో సిరిసిల్ల సబ్ డివిజన్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలన్నారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
News October 17, 2025
గంగాధర: పిల్లలలో లోపపోషణ నివారణకు పటిష్ట చర్యలు

పిల్లలలో లోపపోషణ నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. శుక్రవారం సభలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సేవలను పర్యవేక్షిస్తామన్నారు.
News October 17, 2025
లిక్కర్ షాపులకు నో ఇంట్రెస్ట్!

TG: లిక్కర్ షాపుల దరఖాస్తులకు అనుకున్నంత స్పందన రావట్లేదు. గతంతో పోలిస్తే నిన్నటి వరకు 55% తక్కువ దరఖాస్తులు రావడంతో అప్లికేషన్లు సమర్పించాలని అబ్కారీ శాఖ వ్యాపారులకు SMSలు పంపుతోంది. ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. అలాగే గత మూడేళ్లతో పోల్చితే 2024లో అమ్మకాలు, లాభాలు తగ్గాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం.
*దరఖాస్తులకు రేపే చివరి తేదీ.