News February 12, 2026

సీఎంఆర్ రైసును మిల్లర్లు సకాలంలో ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను రైస్ మిల్లర్లు సకాలంలో ఎఫ్‌సీఐకి అందజేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి సూచించారు. గురువారం డిఫాల్ట్ రైస్ మిల్లర్లు, టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వానికి చెల్లించే పెనాల్టీలను త్వరగా చెల్లించాలన్నారు.టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ, పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 11)

image

1689: ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మరణం
1915: భారత లెజెండరీ క్రికెటర్ విజయ్ హజారే జననం (ఫొటోలో)
1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
1979: తెలుగు సాహితీకారుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ మరణం

News March 11, 2026

మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్..!

image

ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని హైదరాబాద్ మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

News March 11, 2026

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపండి: US

image

ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌ను అమెరికా కోరినట్లు US మీడియా సంస్థ Axios పేర్కొంది. ఇరాన్ ఆయిల్, ఎనర్జీ సదుపాయాలపై మరిన్ని దాడులు చేస్తే ఆ దేశ ప్రజలకు హాని కలగవచ్చని, ఆయిల్ ధరలు భారీగా పెరగొచ్చని US చెప్పినట్లు తెలిపింది. అలాగే గల్ఫ్ దేశాల ఎనర్జీ సదుపాయాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశమూ ఉందని, యుద్ధం తర్వాత ఆయిల్ సెక్టార్‌కు ఇరాన్ సహకారం అవసరమని US భావిస్తోందని వెల్లడించింది.