News February 12, 2026
సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థుల సత్తా

సీఎంఏ ఫలితాల్లో గుంటూరు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఫలితాల్లో దేశ స్థాయిలో 25ర్యాంకులు సాధించారు. ఫైనల్‌లో 16, 17, 30, 31, 40ర్యాంకులు, ఇంటర్‌లో 5వ ర్యాంకుతో పాటు మొత్తం 20 ర్యాంకులు దక్కించుకున్నారు. GNT సెంటర్ నుంచి 23 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయని విద్యాసంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ తెలిపారు.
Similar News
News March 15, 2026
అనకాపల్లి: రేపటి నుంచి రైతన్న-మీ కోసం

జిల్లాలో ఈనెల 16 నుంచి రైతన్న-మీకోసం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ సహకారం ప్రధాన అంశాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటితోపాటు రాబోయే ఎల్‌నినోపై సలహాలు, సూచనలు ఇస్తారన్నారు. 16, 17, 18, 23, 24, 25 తేదీల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
News March 15, 2026
అలర్ట్..డొంకరాయి జలాశయం నుంచి 3,700 క్యూసెక్కుల నీరు విడుదల

ఇరిగేషన్ అధికారుల ఆదేశాలతో డొంకరాయి జలాశయం నుంచి ఆదివారం 3 గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చీఫ్ ఇంజినీర్ రాజారావు తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలకు రబీ సీజన్ అవసరాలకు 8,000 క్యూసెక్కుల నీరు అవసరం కాగా డొంకరాయి జలాశయం గేట్ల ద్వారా 3,700 క్యూసెక్కులు, జలవిద్యుత్ ఉత్పత్తి అనంతరం 4,300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 15, 2026
అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేయవద్దు- కలెక్టర్

గ్యాస్ సరఫరాపై వినియోగదారులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తప్పుడు వార్తలను నమ్మి ఒకేసారి ఎక్కువ బుకింగ్‌లు చేయవద్దని, అవసరమైనప్పుడే సిలిండర్లు తీసుకోవాలని కోరారు. వాట్సాప్, మిస్డ్ కాల్ లేదా ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇంటి నుండే సులభంగా గ్యాస్ బుక్ చేసుకోవచ్చని సూచించారు. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, ఆయిల్ కంపెనీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆమె భరోసా ఇచ్చారు.


