News November 20, 2024
సీఎంకు జ్ఞాపికను అందజేసిన MLA నాయిని

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్త్రీ శక్తి గురించి తెలిపే ప్రత్యేకంగా తయారు చేయించిన జ్ఞాపికను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే వెంట ఉన్నారు.
Similar News
News March 16, 2026
WGL: సింహపురి ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

వరంగల్-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.
News March 15, 2026
జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్‌లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.
News March 15, 2026
ప్రజా పంపిణీ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న బియ్యం దుర్వినియోగం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్యశారద ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె పౌర సరఫరాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బియ్యం పక్కదారి పట్టకుండా నిఘా ఉంచాలని సూచించారు. డీఆర్ఓ రామ్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి పాల్గొన్నారు.


