News July 3, 2024
సీఎంకు తుమ్మల లేఖ

భద్రాచలం మండలంలోని ఆంధ్రాలో కలిపిన 5గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, విభజన చట్టంలోని హామీలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో 5గ్రామ పంచాయతీలను కలపాలని లేఖ ద్వారా తుమ్మల సీఎంను కోరారు.
Similar News
News October 25, 2025
సత్తుపల్లిలో 5 వేల ఉద్యోగాలకు రేపు జాబ్ మేళా

రేపు సత్తుపల్లిలోని రాణీ సెలబ్రేషన్స్‌లో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ కోరారు. 80కి పైగా కంపెనీల్లో సుమారు 5 వేల ఉద్యోగాల కోసం ఉదయం 8 గంటలకు అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో రావాలన్నారు. సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే ఈ జాబ్ మేళా ఎమ్మెల్యే డా.రాగమయి సారథ్యంలో చేపడుతున్నామన్నారు.
News October 25, 2025
పది విద్యార్థులు 30లోగా ఫీజు చెల్లించండి: ఇన్ఛార్జ్ డీఈవో

2026 మార్చిలో నిర్వహించే పరీక్షలకు హాజరు కానున్న పదోతరగతి, ఒకేషనల్ విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ఇన్ఛార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. రూ.50 పైన్‌తో నవంబరు 15, రూ.200ల ఆలస్య రుసుంతో డిసెంబరు 2, రూ.500 పైన్‌తో డిసెంబరు 15 లోగా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.
News October 25, 2025
మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ. 2,400: కలెక్టర్

2025-26 మార్కెటింగ్ సీజన్లో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 కనీస మద్దతు ధరను ప్రకటించిందని, ఈ ధరకు కొనుగోలుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 1,705 ఎకరాల సాగవుతుందన్నారు. 5,456 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.


