News November 22, 2024
సీఎంకు నివేదిక సమర్పించిన త్రి సభ్య కమిటీ సభ్యులు
లగచర్ల స్థల సేకరణపై జరిగిన ఘటన గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ సభ్యులు లగచర్ల గ్రామ రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి డిమాండ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందించారు. దీనిపై స్పందించిన సిఎం రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ MP మల్లు రవి, అగ్రికల్చర్ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, VKB DCC అధ్యక్షుడు, MLA టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 23, 2024
HYD: మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటారా?: సాయి
అబద్ధాలు మాట్లాడడంలో KCR, హరీశ్‌రావును KTR మించిపోయాడని ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ మండిపడ్డారు. ఈరోజు HYD గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. KTR దిమాక్ లేకుండా మాట్లాడుతున్నాడని, మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలంటూ ట్వీట్స్ చేస్తున్నాడని అన్నారు. చేపల పెంపకంపై గత BRS ప్రభుత్వం వల్ల కాలేదని.. 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్లే అవార్డు వచ్చిందని తెలిపారు.
News November 23, 2024
HYD: WOW.. అందర్నీ ఆకట్టుకున్న రచన
హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో కళా సంకర్షిణి ప్రవేశ్ ప్రోగ్రాంలో ఎన్.రచన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. వినూత్న వేషధారణతో, తన కళా ప్రతిభ నాట్య రూపాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆమె ప్రతిభను మెచ్చుకున్నారు.
News November 23, 2024
HYD: ‘కాకతీయ కళలు సంస్కృతికి నిదర్శనం’
హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ రూబీ పాల్గొన్నారు. ఓరుగల్లు కాకతీయుల కళా ప్రదర్శనను చూసిన ప్రొఫెసర్ మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల కళలలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనమనికీర్తించారు. కాకతీయ మహారాణి రుద్రమదేవి పౌరుషంతో ప్రతి మహిళ తన గుండెలో పోరాట పటిమను నింపుకోవాలన్నారు.