News March 13, 2025

సీఎంతో బ్రాండిక్స్‌ దొరస్వామి భేటీ

image

ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారని అచ్యుతాపురం మండలంలో గల బ్రాండిక్స్‌ అధిస్తాన్‌ సంస్థ భారత్‌ భాగస్వామి దొరస్వామి తెలిపారు. బుధవారం ఆయన అమరావతిలో సీఎంని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బ్రాండిక్స్‌ సంస్థ పేరు అధిస్తాన్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ పార్కుగా మార్పు, విస్తరణ, ఉపాధి పెంపు లక్ష్యాలను చంద్రబాబుకు వివరించారు.

Similar News

News April 14, 2026

పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

image

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>

News April 14, 2026

మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.

News April 14, 2026

3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

image

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.