News August 5, 2024
సీఎంతో సమావేశమైన మంత్రులు, కలెక్టర్లు

సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న కలెక్టర్ల సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు సైతం హాజరయ్యారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు హాజరయ్యారు. అలాగే జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధి పైన వీరికి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News July 8, 2025
ప్రకాశం: అద్దెకు ఇళ్లు.. చివరికి బెదిరింపులు

తన ఇంట్లో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని బెదిరిస్తున్న వైనంపై సదరు బాధితురాలు సోమవారం SP దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఓ మహిళకు ఒంగోలులో నివాసం ఉంది. ఆ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు. వారు అద్దె డబ్బులు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు సదరు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News July 8, 2025
ఒంగోలు: ‘త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News July 7, 2025
ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.