News January 28, 2025
సీఎంను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, యశస్విని రెడ్డి తోటి ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై వారు సీఎంతో చర్చించారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలని, ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. తప్పకుండా అభివృద్ధికి కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 17, 2025
16 పోస్టులకు ఐఐసీటీ నోటిఫికేషన్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<
News November 17, 2025
HYD: ప్రమాదంపై చర్యలు వేగవంతం: సీఎస్

సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై చర్యలు వేగవంతం చేసేందుకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం అందించేందుకు, సహాయం కల్పించేందుకు 24×7 హెల్ప్లైన్ నంబర్ ఉంటుందన్నారు.


