News August 18, 2024
సీఎంను కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించి పలు విషయాల పై చర్చించారు.
Similar News
News December 5, 2025
రణస్థలం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.
News December 5, 2025
రణస్థలంలో జిల్లా పంచాయతీ అధికారి పర్యటన

రణస్థలం మండలం పరిధిలోని జె.ఆర్ పురం చెత్త సంపద కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య శుక్రవారం పరిశీలించారు. వర్మీ కంపోస్టు తయారీ, చెత్త సేకరణ పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సేకరించిన చెత్తను, కేంద్రం వద్ద వేరు చేసి తడి చెత్త వర్మీ కంపోస్టుగా తయారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ గోపీ బాల, పంచాయతీ కార్యదర్శిలు లక్ష్మణరావు, ఆదినారాయణ, శానిటేషన్ మేస్త్రి ఫణి పాల్గొన్నారు.
News December 5, 2025
శ్రీకాకుళం: పోలీసుల తనిఖీల్లో..శిక్షలు వీరికే

శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన వారికి శిక్షలు పడ్డాయి. డ్రంక్&డ్రైవ్ రూ.10వేలు, బహిరంగ మద్యం కేసుల్లో రూ.1000ల జరిమానా కోర్టు విధించిందని SP కేవీ మహేశ్వరెడ్డి నిన్న తెలిపారు. సోంపేట-3, బారువా-1, పలాస-16, టెక్కలి-3, మెళియాపుట్టి-9, డ్రంక్&డ్రైవ్-నరసన్నపేటలో ఒకరికి రూ.2,500, మరొకరికి రూ.5000లు ఫైన్ వేశారు. ఆమదాలవలస, సారవకోట-ఇద్దరికి 5 రోజుల జైలు శిక్ష పడింది.


