News August 18, 2024

సీఎంను కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును శనివారం ఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శాఖ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రితో రాష్ట్రానికి సంబంధించి పలు విషయాల పై చర్చించారు.

Similar News

News September 20, 2024

హైదరాబాద్‌లో సిక్కోలు వాసి మృతి

image

కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన లుకలాపు పాపయ్య కుమారుడు జనార్దన్ (42) శుక్రవారం హైదరాబాద్‌లో మరణించాడు. సహోద్యోగులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. మృతుడు 2001 నుంచి అక్కడే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి రాకుండా సెకండ్ షిఫ్ట్‌లో ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

News September 20, 2024

టెక్కలిలో రూ.4 కోట్ల విద్యుత్ బకాయి.. పరిశ్రమకు కరెంట్ కట్

image

టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.

News September 20, 2024

శ్రీకాకుళం జిల్లాకు నేడు వర్ష సూచన

image

శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాలలో సైతం రేపు అక్కడక్కడా వర్షాలు పడతాయని APSDMA వర్గాలు పేర్కొన్నాయి.