News June 24, 2024
సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్: మంత్రి
సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు.. కరెక్టింగ్ మాస్టర్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం దుబారా ఖర్చులకు దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలను అమలుచేస్తుందన్నారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇచ్చి వారి పురోగతికి తోడ్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
Similar News
News November 12, 2024
మహిళలు ఆర్థికంగా ముందుకు వెళ్లాలి: జిల్లా కలెక్టర్
మహిళలు నాణ్యత, నమ్మకమే బ్రాండ్‌గా వ్యాపారంలో రాణించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ఉన్న ఇందిర మహిళా శక్తి క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. నలుగురు మహిళలు గ్రూప్‌గా క్యాంటీన్‌ని నిర్వహిస్తున్న నిర్వాహకురాలను పలుకరిస్తూ వ్యాపారం సాఫిగా సాగుతుందా? సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
News November 11, 2024
జిల్లాలో తొలి బయోమైనింగ్ కేంద్రం ప్రారంభం
ఇల్లెందు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలోనే తొలి బయో మైనింగ్ కేంద్రం ఇల్లెందులో ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో డంపింగ్ చేసి గుట్టల గుట్టలుగా పెరిగిపోయిన చెత్తను రీసైక్లింగ్ చేసి కాలుష్యం కాకుండా పర్యావరణాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
News November 11, 2024
కేటీఆర్ ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారు?: పొంగులేటి
KTR ఎవరి కాళ్లు మొక్కేందుకు ఢిల్లీ వెళ్లారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్రం పెద్దలను ఒప్పించి తన చెల్లికి బెయిల్ ఇప్పించినట్లే తనను తాను కాపాడుకునేందుకు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు వెళ్లారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు విదేశాల్లోని సంస్థలకు రూ.55 కోట్లను ఏ విధంగా మళ్లించారని ప్రశ్నించారు. తాను పేల్చబోయే బాంబేదో కేటీఆర్‌కు తెలుసని చెప్పారు.